Telugu Gateway
Cinema

బాలకృష్ణను ఎలా వాడాలో బోయ‌పాటికే తెలుసు

బాలకృష్ణను ఎలా వాడాలో బోయ‌పాటికే తెలుసు
X

అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం నాడు హైద‌రాబాద్ లో అట్ట‌హాసంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ ఎస్ రాజ‌మౌళితోపాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి మాట్లాడుతూ ఆటంబాంబు లాంటి ఎనర్జీ ఉండే నందమూరి బాలకృష్ణను ఎలా వాడాలో బోయ‌పాటి శ్రీనుకు తెలిసిన‌ట్లు మ‌రెవ‌రికీ తెలియ‌ద‌ని వ్యాఖ్యానించారు.

డిసెంబ‌ర్ 2 నుంచి థియేట‌ర్ల‌లో హంగామా ప్రారంభం కానుంద‌ని..తాను కూడా ఈ సినిమాను థియేట‌ర్ లో చూసేందుకు రెడీగా ఉన్న‌ట్లు తెలిపారు. ఈ సీక్రెట్ ను బోయ‌పాటి శ్రీను అంద‌రికీ చెప్పాల‌న్నారు. బాలకృష్ణ కూడా త‌న ఎన‌ర్జీ సీక్రెట్ ను బ‌హిర్గ‌తం చేయాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి అఖండ సినిమాకు సంబంధించిన డ్యూయెట్ ను విడుద‌ల చేశారు. అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో ఉన్న లో జోష్ అంతా రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉండాల‌న్నారు. అఖండ పెద్ద హిట్ అవ్వాలి..ప‌రిశ్ర‌మ‌కు మంచి ఊపు తేవాల‌ని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

Next Story
Share it