మాల్దీవుల్లో ప్రభాస్ ఎంగేజ్మెంట్ !

టాలీవుడ్ కు చెందిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి వార్తలు ...ప్రేమ వార్తలు చాలా సార్లే వచ్చాయి. . ఇప్పుడు మరో సారి ఏకంగా వచ్చే వారంలో ప్రభాస్ మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోనున్నట్లు మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తో ఎంగేజ్మెంట్ అంటూ ఈ వార్తల సారాంశం. కృతి సనన్, ప్రభాస్ లు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే తప్ప ..ప్రేమ..డేటింగ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని వాళ్లిద్దరూ ఖండించారు.
ఇప్పుడు మరో సారి ప్రభాస్ టీం మాల్దీవుల్లో ఎంగేజ్మెంట్ వార్తలను కూడా ఖండించింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ సినిమాలకు అందరికంటే ముందు రివ్యూలు ఇచ్చే ఉమైర్ సందు వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించి ట్వీట్ చేయటంతో దీనికి కొంత ప్రాధాన్యత వచ్చింది. ఓవర్సీస్ సెన్సార్ బోర్డు మెంబర్ గా చెప్పుకుంటూ అయన ప్రతి సినిమాకు రివ్యూలు ఇచ్చే విషయం తెలిసిందే. అయితే అయన చెప్పిన దానికి బిన్నంగా పలు సినిమాల రిజల్ట్స్ వచ్చాయి కూడా.