Telugu Gateway
Cinema

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్

ప్రభాస్ ఫ్యాన్స్ కు ఊహించని గిఫ్ట్
X

ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ రారాజు. ఎందుకంటే తన ప్రతి సినిమాకు అత్యధిక కలెక్షన్స్ సాధిస్తూ కొత్త కొత్త రికార్డు లు క్రియేట్ చేయటంలో ఇప్పుడు ప్రభాసే కింగ్. తాజాగా కల్కి సినిమాతో కూడా ప్రభాస్ ఎన్నో కొత్త రికార్డు లు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కల్కి సినిమా 1100 కోట్ల రూపాయల వసూళ్లతో దూసుకు వెళుతోంది. ఈ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తూ రాజాసాబ్ చిత్ర యూనిట్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. అదేంటి అంటే మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ గ్లింప్స్ ను ఆగస్ట్ 29 అంటే సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇదే విషయం వెల్లడిస్తూ న్యూ లుక్ విడుదల చేశారు. ఈ ప్రభాస్ లుక్ పై ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు అనే చెప్పాలి.

రాజాసాబ్ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తుంటే...థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త ప్రభాస్ ను చూస్తారు అంటూ దర్శకుడు మారుతి గత కొంత కాలంగా రాజాసాబ్ మూవీ పై అంచనాలు పెంచుతూ వస్తున్నారు. గ్లింప్స్ కు రంగం సిద్ధం అయింది అంటే ...ఈ సినిమా విడుదల ముహూర్తం కూడా దగ్గరలోనే ఉన్నట్లు అని ఫ్యాన్స్ ఒక అంచనాకు వస్తున్నారు. మరో వైపు ప్రభాస్ తన కొత్త సినిమా ల కోసం సిద్ధం అవుతున్నారు. వంగా సందీప్ రెడ్డి తో కలిసి స్పిరిట్ సినిమా తో పాటు ప్రభాస్ సాలార్ 2 సినిమా కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా ప్రభాస్ లైన్ లో పెట్టాడు అని చెపుతున్నారు.

Next Story
Share it