Telugu Gateway
Cinema

రెండేళ్ల తర్వాత విడుదలకు ఇప్పుడే పండగా?

రెండేళ్ల తర్వాత విడుదలకు ఇప్పుడే పండగా?
X

అభిమానులకు తమ హీరో సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఆసక్తి కలిగిస్తాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్ చాలా ఆసక్తికరంగా..ఆశ్చర్యకరంగా ఉంది. ఎప్పుడో 2022లో ఆగస్టులో అంటే ఇంచుమించు రెండేళ్ళు ఉంది ఈ సినిమా విడుదలకు. దీనికి సంబంధించి ఇప్పుడు అప్ డేట్ ఇవ్వటంలో ఏమి ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ఓ వైపు రాథే శ్యామ్ సినిమా చేస్తున్నారు.

దీంతోపాటు ఆది పురుష్ షూటింగ్ లో కూడా పాల్గొననున్నారు. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ఈ 'ఆది పురుష్‌' అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది కూడా భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it