Telugu Gateway
Cinema

కళల విభాగంలో

కళల విభాగంలో
X

టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ పురస్కారం దక్కింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రకటించింది. కళల విభాగంలో భాగంగా బాలకృష్ణకు ఈ పురస్కారం దక్కింది. ఇప్పటికే బాలకృష్ణ 109 సినిమాలను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన సంక్రాంతికి డాకుమహారాజ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నారు.

అయితే అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో బీజేపీ, తెలుగు దేశం పార్టీ లు కలిసి అధికారాన్ని పంచుకుంటున్న సమయంలో బాలకృష్ణ కు ఈ అవార్డు దక్కటం ప్రాధాన్యత సంతరించుకుంది అనే చెప్పాలి. గత కొంత కాలంగా టీడీపీ దివంగత నేత, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. వైద్య విభాగంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మంద కృష్ణ మాదిగకు ప్రజా వ్యవహారాల విభాగం లో పద్మ శ్రీ అవార్డు ప్రకటించారు.

Next Story
Share it