చిరంజీవి ఇంట్లో 'సింధు సందడి'

పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌లు ఆగస్ట్ 20వ తేదీన తమ ఇంటిలో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో చిరంజీవి కుటుంబ సభ్యులందరితో పాటు, నాగార్జున కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్ తదితరులు పాల్గొన్నారు. పీవీ సింధుని సత్కరించుకోవడం.. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేయగా.. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సింధు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే ఒలంపిక్స్ లో స్వర్ణం సాధిస్తానని సింధు దీమా వ్యక్తం చేశారు.