నిహారిక పెళ్లి సందడి షురూ
BY Admin7 Dec 2020 11:45 AM IST
X
Admin7 Dec 2020 11:45 AM IST
నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లి సందడి మొదలైంది. పెళ్లి వేడుక రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరగనుంది. దీని కోసం ఇప్పటికే ఇరు కుటుంబాలకు చెందిన సభ్యులు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళారు. కరోనా భయంతో పరిమిత అతిధులతోనే ఈ వేడుక నిర్వహించనున్నారు. ఈనెల 9న జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్ళి జరగనుంది. ఉదయపూర్ బయలుదేరిన ఫోటోను నిహారిక తన ట్విటర్‌లో పోస్టు్ చేశారు.
మరో వైపు నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా హంగామా సాగుతున్నాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులంతా సందడి చేస్తున్నారు. తాజాగా నాగాబాబు నిహారిక-చిరంజీవి దిగిన ఓ సెల్పీ ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేశారు. 'అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మార్చుతుంది' అంటూ చిరంజీవి గురించి ట్వీట్ చేశారు నాగబాబు.
Next Story