Telugu Gateway
Cinema

అంచనాలకు అందం అంటున్న బాలకృష్ణ

అంచనాలకు  అందం అంటున్న బాలకృష్ణ
X

అఖండ హిట్. ఆ తర్వాత వీరసింహ రెడ్డి కూడా హిట్. మరి ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన 108 వ సినిమా పై అదే కసితో పని చేస్తున్నారు. తొలి సారి దర్శకుడు అనిల్ రావిపూడి, బాల కృష్ణ కాంబినేషన్ కావటం, అంతకు ముందు బాలకృష్ణ సినిమాలు రెండు వరసగా హిట్ కావటం తో అయన అభిమానులు కొత్త సినిమాపై కూడా భారీ అసలే పెట్టుకున్నారు. ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ రెండు బాలకృష్ణ కొత్త లుక్స్ విడుదల చేసింది. అంతే కాదు...అందులో అభిమానులకు ఒక అదిరిపోయే అలెర్ట్ కూడా ఇచ్చింది.

అదేంటి అంటే ఈ సారి మీ ఊహలకు ఏ మాత్రం అందదు అంటూ న్యూ లుక్స్ పై రాశారు. దీంతో అంత కొత్తగా ఏమి ఉంటుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో కనిపిస్తుంటే...బాలకృష్ణ జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి బాలకృష్ణ, అయన ఫాన్స్ ఆశిస్తున్నట్లు ఈ సినిమా కూడా హ్యాట్రిక్ హిట్ సాధిస్తే ఫాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Next Story
Share it