నానికి జోడీగా కొత్త హీరోయిన్
BY Admin13 Nov 2020 4:45 PM GMT
X
Admin13 Nov 2020 4:45 PM GMT
టాలీవుడ్ కు కొత్త హీరోయిన్ వస్తోంది. ఆమే నజ్రియా ఫహద్. న్యాచురల్ స్టార్ నానితో కలసి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని కొత్త సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను చిత్ర యూనిట్ నవంబర్ 21న ప్రకటించనుంది. ఈ సందర్భంగా నజ్రియా ఈ కార్యక్రమానికి సంబంధించిన పొస్టర్‌ను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
'ఇదే నా మొదటి తెలుగు సినిమా గయ్స్.. అద్భుతమైన టీంతో వర్క్ చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నవంబర్ 21 తేదీని వైరల్ చేయండి.. ట్యూన్ చేయండి, హ్యాపీ దీపావళి' అంటూ పోస్ట్ చేశారు. ఆమె మళయాళం సినిమా బెంగుళూరు డేస్ లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నాని కొత్త సినిమా నిర్మించనుంది.
Next Story