టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డులపై బాలకృష్ణ

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఎంత పాపులర్ ఏరియానో అందరికి తెలిసిందే. అక్కడ ఉండే బిల్ బోర్డ్స్ పై డిస్ప్లే ప్రకటనలు వేయాలంటే కూడా ఒక రేంజ్ లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక్క రోజు యాడ్ వేయటానికి తక్కువలో తక్కువ నాలుగు లక్షల రూపాయల పైనే అవుతుంది. (ఐదు వేల డాలర్స్) , గరిష్టంగా 41 లక్షల రూపాయలు (ఏభై వేల డాలర్స్) అవుతుంది. అయితే ఇది వివిధ అంశాల ఆధారంగా ఉంటుంది. తాజాగా టాలీవుడ్ కు చెందిన సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కూడా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర అయన సినిమా లకు సంబదించిన పలు లుక్స్ ప్రత్యక్షం అయ్యాయి. 150 అడుగుల ఎత్తు, వంద అడుగుల వెడల్పు తెరపై బాలకృష్ణ ఫోటో లు ప్రదర్శించారు.
ఒక రోజు పాటు ప్రతి పది నిమిషాలకు ఒక సారి 15 సెకన్ల పాటు ఇవి వచ్చాయి. ఒక ట్రస్ట్ తో పాటు కొంత మంది ఎన్ఆర్ఐ లు ఇవి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నందమూరి బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. దీనికి సంబదించిన ఫోటో లు ఇప్పుడు ట్విట్టర్ లో బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. మరో వైపు బాబీ దర్శకత్వంలో ఎన్ బికె 109 ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.