అల్లు అర్జున్ పై ట్వీట్ డిలీట్ చేసిన నాగబాబు
నాగ బాబు కు కౌంటర్ గా అల్లు అర్జున్ చేసినట్లు సోషల్ మీడియా లో ఒక ట్వీట్ వైరల్ అయింది. అదేంటి అంటే అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే నాగబాబు అనే వ్యక్తి బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాప్ లో పంక్చర్లు వేసుకునేవాడు అని ఉంది. ఇది కూడా పెద్ద కలకలమే రేపింది. ఇలా పరస్పర ట్వీట్స్ తో వ్యవహారం రచ్చ రచ్చగా మారటంతో నాగ బాబు పై సోషల్ మీడియా లో ఎటాక్ కూడా పెరిగింది. ఈ దెబ్బకు అయన రెండు రోజుల పాటు తన ఎక్స్ ఖాతాను డీ ఆక్టివేట్ చేసుకున్నారు. తిరిగి శనివారం అయన ఎక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాదు...నేను నా ట్వీట్ ను తొలగించాను అని రాసుకొచ్చారు. దీంతో మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇన్ని రోజుల తర్వాత నాగబాబు ఎందుకు ట్వీట్ తొలగించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇలా చేశారా...లేక ఈ విషయంలో తెర వెనక ఏమైనా జరిగిందా అన్న చర్చ సాగుతోంది.