Telugu Gateway
Cinema

గూగుల్ లో వెతికిన టాప్ టెన్ సినిమా లు ఇవే

గూగుల్ లో వెతికిన టాప్ టెన్ సినిమా లు ఇవే
X

మరి కొన్ని రోజుల్లోనే 2022 కాలగతిలో కలిసిపోనుంది. కరోనా తర్వాత దేశ సినిమా పరిశ్రమ మళ్ళీ పట్టాలు ఎక్కింది ఈ ఏడాదిలోనే. చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో గూగుల్ ఒక ఆయుధం లాంటిదే. ఏమి కావాలన్నా ఠక్కున గూగుల్ లో వెతుకుతారు. అలాగే 2022 లో ఎక్కువ మంది వెతికిన సినిమాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో మొదటి ప్లేస్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ కి దక్కింది. సెకండ్ ప్లేసులో కేజీఎఫ్ 2 ఉండగా, కాశ్మీరీ ఫైల్స్ మూడవ స్థానములో, ఆర్ఆర్ఆర్ నాల్గవ స్థానములో, కాంతారా ఐదు, పుష్ప ది రైజ్ ఆరు, విక్రమ్ ఏడు, లాల్ సింగ్ చద్దా ఎనిమిది, దృశ్యం 2 , తోర్: లవ్ అండ్ థండర్ పదవ స్థానంలో ఉన్నాయి.

బాక్స్ ఆఫీస్ వసూళ్ల పరంగా చూస్తే ఆర్ఆర్ ఆర్, కెజీఎఫ్ 2 లు ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపాయి. కానీ హిందీ మార్కెట్ చాలా పెద్దది కావటం తో బ్రహ్మాస్త్ర ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ సినిమా వసూళ్లు అంత ఆశాజనకంగా లేవనే విషయం తెలిసిందే. చిన్న సినిమాలుగా వచ్చినా కాశ్మీర్ ఫైల్స్, కాంతారా లు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపాయి. అలాగే గూగుల్ ట్రెండ్ లో నిలిచాయి. మరో కీలక విషయం ఏమిటి అంటే ఈ టాప్ టెన్ లో రెండు తెలుగు సినిమా లు ఉండటం.

Next Story
Share it