Telugu Gateway
Cinema

ఛిరంజీవికి కరోనా తూచ్..తాజాగా నెగిటివ్

ఛిరంజీవికి కరోనా తూచ్..తాజాగా నెగిటివ్
X

మెగా స్టార్ చిరంజీవి కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలం, కరోనా కన్ప్యూజ్ చేసి తనతో ఆడేసుకున్నాయని పేర్కొన్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చింది. ఈ నెగిటివ్ సర్టిఫికెట్ ను కూడా చిరంజీవి ట్విట్టర్ లో షేర్ చేశారు. తాజాగా డాక్టర్ల బృందం మూడు రకాల టెస్ట్ లు చేసి తనకు కోవిడ్ నెగిటివ్ అని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. అంతకు ముందు చేసిన పరీక్షలో వచ్చిన ఫలితం ఆర్ పీసీఆర్ కిట్ లో తేడా వల్ల వచ్చిందని తెలిపారు. తాను త్వరగా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన వారు..తనపై అభిమానం చూపించిన వారికి చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే బేసిక్ మెడికేషన్ ప్రారంభించానని, ఎక్కడా తనకు ఎలాంటి లక్షణాలు లేకపోవటంతో అనుమానం వచ్చి అపోల్ డాక్టర్స్ ను సంప్రదించినట్లు తెలిపారు. సీబీ స్కాన్ చేసి చెస్ట్ లో ఎలాంటి లక్షణాలు కన్పించటం లేదని తేల్చారు. తర్వాత మరో ల్యాబ్ లో కూడా మూడు రకాల పరీక్షలు చేయించుకుని నిర్ధారించుకున్నట్లు తెలిపారు.ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి పరీక్ష ఫలితం తప్పుడు కిట్ వల్ల వచ్చిందని గుర్తించినట్లు వెల్లడించారు.

Next Story
Share it