Telugu Gateway
Cinema

మ‌హేష్ బాబు బ‌స చేసిన హోట‌ల్ అద్దె రోజుకు రెండు ల‌క్షల‌పైనే!

మ‌హేష్ బాబు బ‌స చేసిన హోట‌ల్ అద్దె రోజుకు రెండు ల‌క్షల‌పైనే!
X

సెల‌బ్రిటీల విదేశీ టూర్లు చాలా స‌హ‌జం. ప్ర‌తి సినిమాకు కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ సంపాదించే వారు ఖర్చు కూడా అలాగే చేస్తారు. ఫ్యామిలీతో క‌ల‌సి విదేశీ టూర్లు చేయ‌టంలో టాలీవుడ్ హీరోల్లో మ‌హేష్ బాబు ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఇంచుమించు ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఓకసారి ఆయ‌న ఫ్యామిలీతో క‌ల‌సి ఏదో ఒక దేశానికి చెక్కేస్తారు. అంతే కాదు..ఆ వివ‌రాల‌ను ఆయ‌న కంటే ఎక్కువ‌గా మ‌హేష్ భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. షూటింగ్ లో ఎప్పుడు గ్యాప్ దొరికినా మ‌హేష్ బాబు మాత్రం ఛ‌లో టూర్ అంటుంటారు. తాజాగా ఆయ‌న పారిస్ టూర్ లో ఉన్నారు. స‌ర్కారువారి పాట సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ళారు.

ఈ సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. మే7న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. అంటే ఈలోగా ఆయ‌న హైద‌రాబాద్ వ‌చ్చేస్తారు. మ‌హేష్ బాబు బుద‌వారం నాడు ఇన్ స్టాలో తాము పారిస్ లో బ‌స‌చేసిన హోట‌ల్ పేరుతో ఒక ఫోటోను విడుద‌ల చేశారు. స‌ర‌దాగా ఆ హోట‌ల్ వివ‌రాలు చూద్దామ‌ని చూస్తే మ‌హేష్ బాబు బ‌స‌చేసిన హోట‌ల్ లో రోజుకు అద్దె రెండు ల‌క్షల రూపాయ‌ల‌పైనే ఉంది. ప్ర‌తి టాప్ ట్రావెల్ వెబ్ సైట్ కూడా ఇదే ధ‌ర‌ను చూపించింది. మ‌హేష్ బాబుకు అది పెద్ద ధ‌ర కాక‌పోయినా సంప‌న్నుల‌ను సైతం ఇది షాక్ ఇచ్చే ధ‌రే ఇది.


Next Story
Share it