Telugu Gateway
Cinema

అదిరిపోయే మహేష్ బాబు కొత్త కారు

అదిరిపోయే మహేష్ బాబు కొత్త కారు
X

సెలెబ్రిటీలు ఖరీదైన కొత్త ఇళ్ళు కొన్నా...కొత్త కారు కొన్నా వాళ్ళ వాళ్ళ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతారు. అదేదో అవి వాళ్ళ సొంతం అయినట్లు ఫీల్ అవుతారు. దీనికి ప్రధాన కారణం అది వాళ్లపై ఉండే అభిమానమే. టాలీవుడ్ టాప్ హీరో మహేష్ బాబు తాజాగా 5 .4 కోట్ల రూపాయల తో రేంజ్ రోవర్ ఎస్ వి కారు కొనుగోలు చేశారు. అదే సమయంలో దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. హైదరాబాద్ లో బంగారం రంగుతో కూడిన తొలి రేంజ్ రోవర్ కారు కలిగి ఉన్న ఏకైక వ్యక్తి మహేష్ బాబు అని పింక్ విల్లా. కామ్ తెలిపింది. గత ఏడాదే మహేష్ బాబు 1 .19 కోట్ల రూపాయాలు పెట్టి ఆడి ఈ- ట్రాన్ కారు కొనుగోలు చేశారు. ఇప్పుడు మహేష్ బాబు గ్యారేజ్ లో మరో ఖరీదైన రేంజ్ రోవర్ వచ్చి చేరింది.

టాలీవుడ్ లో ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్ దగ్గర కూడా ఈ కార్లు ఉన్నాయి. అత్యంత ఖరీదైన మహేష్ బాబు గోల్డ్ కలర్ రేంజ్ రోవర్ కారు ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్నాయి. గత ఏడాది సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13 న అంటే సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలవనుంది. గుంటూరు కారం సినిమా పూర్తి కాగానే మహేష్ బాబు ప్రముఖ దర్శకుడు రాజమౌళితో తన 29 వ సినిమా మొదలు పెట్టబోతున్నారు. బాహుబలి లాగా ఇది రెండు పార్టీలుగా ఉంటుంది అని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it