మా ఎన్నికల వివాదం..నరేష్ పై హేమ విమర్శలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల వివాదం ఓ కొలిక్కి రావటం లేదు. కొంత కాలంగా అంతా మౌనంగానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. తాజాగా నటి హేమ సభ్యులకు పంపిన ఆడియో ఒకటి వెలుగులోకి రావటంతో మళ్ళీ ఈ వ్యవహరం చర్చనీయాంశంగా మారింది. మా ప్రెసిడెంట్ నరేష్ సీటు వదిలేలా లేరని..ఎన్నికలు జాప్యం చేస్తూ ఆయన ఆ సీటులో కూర్చునేలా ఉన్నారని ఆమె ఆరోపించారు. ఎన్నికలు పెట్టాల్సిందిగా అందరికీ తాను లేఖలు పంపిస్తున్నానని..వారు సంతకాలు చేసి ఇస్తే తన మనుషులు వచ్చి వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రస్తుత ప్యానల్ ఒక్క రూపాయి కూడా సంపాదించకుండా, ఉన్నదంతా ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.
తాము ఫండ్ రైజ్ చేసి ఇస్తే.. నరేశ్ ఖర్చు పెడుతున్నారని విమర్శించారు. ఈ సారి మా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమలతో పాటు సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో తనను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకే ఈ సారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంకొంత కాలం నరేష్ ను కొనసాగిస్తే అక్కడ ఉన్న డబ్బులు అన్నీ ఖర్చు అవుతాయన్నారు. తాము ఫండ్ రైజ్ చేసి కార్యకలాపాలు చేసేవాళ్ళమని..కానీ నరేష్ అలా కాకుండా ఉన్న ఫండ్స్ ను వాడేస్తున్నారన్నారు.