Telugu Gateway
Cinema

ప్యారిస్ లో ఎన్టీఆర్

ప్యారిస్ లో ఎన్టీఆర్
X

ఆర్ఆర్ఆర్ షూటింగ్, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షూటింగ్స్ తో ఇంత‌కాలం బిజీగా గ‌డిపిన ఎన్టీఆర్ ఫ్యామిలీతో క‌ల‌సి హాలిడే ట్రిప్ వెళ్లారు. ఆదివారం నాడు ఆయ‌న త‌న కొడుకుతో క‌ల‌సి ఈఫిల్ టవర్ ద‌గ్గ‌ర దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గామారింది. దీన్ని బ‌ట్టి చూస్తే ఎన్టీఆర్ ప్ర‌స్తుతం పారిస్ లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

హాలిడే ట్రిప్ త‌ర్వాత తిరిగి వ‌చ్చిన త‌ర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో పాల్గొన‌టంతోపాటు కొర‌టాల శివ‌తో క‌ల‌సి చేయ‌నున్న త‌దుప‌రి ప్రాజెక్టుపై ఫోక‌స్ పెట్టే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి ఓ వీడియో సందేశం విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it