Telugu Gateway
Cinema

ఓటిటి లో ఎన్ని రికార్డు లు కొడతారో!

ఓటిటి లో ఎన్ని రికార్డు లు కొడతారో!
X

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించిన జైలర్ ఓటిటి ముహూర్తం ఖరారు అయింది. ఈ మూవీ ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఈ సినిమా సెప్టెంబర్ 7 నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. జైలర్ సినిమా విజయం సూపర్ స్టార్ రజనీ కాంత్ కు కూడా ఈ సినిమా లాభాల పంట కూడా పండించింది. ఈ సినిమా కు ఆయన 110 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోగా. రజనీకి ఈ సినిమాలో లాభాల కింద వాటాగా మరో వంద కోట్ల రూపాయలు అందింది. ఈ లాభం చెక్ ను తాజాగా నిర్మాత కళానిధి మారన్ ఇటీవలే హీరో రజనీకాంత్ కు అంధ చేశారు.

దీనికి సంబదించిన ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. జైలర్ సినిమాకు రజని మొత్తం 210 కోట్ల రూపాయలు దక్కించుకున్నట్లు అయింది. అంతే కాదు నిర్మాత రజనీ కాంత్ ఇంటికి రెండు బిఎండబ్ల్యూ కార్లను తీసుకెళ్లి అందులో నచ్చిన కారు ను తీసుకోమని కోరారు. ఇందులో నుంచి రజని కాంత్ బిఎండబ్ల్యూ ఎక్స్ 7 మోడల్ ను తీసుకున్నారు. దీని ధర 1 .25 కోట్ల రూపాయలు. బాక్స్ ఆఫీస్ లో దుమ్ము రేపిన జైలర్ ఓటిటి లో ఎన్ని కొత్త రికార్డు లు తిరగ రాస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it