Telugu Gateway
Cinema

ఆస్కార్ వేదికగా దుమ్మురేపనున్న రాహుల్ ..కాల భైరవ

ఆస్కార్ వేదికగా  దుమ్మురేపనున్న  రాహుల్ ..కాల భైరవ
X

ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానుల్లో ఇదే చర్చ సాగుతుంది. ఎందుకంటే ఏకంగా ఆస్కార్ వేదికపైనే లైవ్ లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట పాడే అవకాశం అకాడమీ కల్పించింది. సినిమాలో ఈ పాట పడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లు అక్కడ ఈ పాట ఆలపించనున్నారు. 95 వ ఆస్కార్ అవార్డు ల ప్రకటన మార్చ్ 12 న జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికి ఈ పాట ఒరిజినల్ సాంగ్స్ విభాగంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న విషయం తెల్సిందే. ఈ తరుణంలో అకాడమీ ప్రకటన చూస్తే ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ పక్క అన్న అభిప్రాయం కలుగుతుంది అని ఎక్కుమంది భావిస్తున్నారు.

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాల సృష్టిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్‌కి అయితే ఈ చిత్రానికి మించిన పాపులారిటీ వచ్చింది. ఈ పాట ఏకంగా సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డునే సొంతం చేసుకుంది. ‘రాహుల్, భైరవ్ పాడాలి.. దానికి ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ వేయాలి. అది మేం చూడాలి’.. ‘భారతీయ సినిమా ఖ్యాతిని పెంచినందుకు రాజమౌళి, కీరవాణికి ధన్యవాదాలు’ అంటూ ఈ హీరో ల ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్ సిఏ) నుంచి కూడా ఇది అవార్డులు దక్కించుకుంది.

Next Story
Share it