కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్..డిశ్చార్జి
BY Admin9 Nov 2020 2:42 PM GMT
X
Admin9 Nov 2020 2:42 PM GMT
కరోనా బారినపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హీరో రాజశేఖర్ సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాజశేఖర్ కు కొన్ని రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అంతే కాకుండా ఆయనకు ఫ్లాస్మా థెరపీ కూడా చేశారు. రాజశేఖర్ తోపాటు ఆయన కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడ్డారు.
జీవితతో వారి ఇద్దరి కుమార్తెలు కరోనా నుంచి వెంటనే కోలుకున్నా రాజశేఖర్ చాలా రోజులు ఈ వైరస్ నుంచి బయటపడేందుకు పోరాడాల్సి వచ్చింది. హైదరాబాద్ లోని సిటీన్యూరో సెంటర్ ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం ఇంటికి వెళ్లిపోయారు. రాజశేఖర్ ను నిత్యం వెంట ఉండి వైద్య సేవలు అందించిన ఆస్పత్రి డాక్టర్లకు, సిబ్బందికి జీవిత ధన్యవాదాలు తెలిపారు.
Next Story