Telugu Gateway
Cinema

అంటే సుంద‌రానికి అంటున్న నాని

అంటే సుంద‌రానికి అంటున్న నాని
X

హీరో నాని కొత్త సినిమా పేరు విచిత్రంగా ఉంది. అంటే సుంద‌రానికి అన్న పేరును చిత్ర యూనిట్ శ‌నివారం నాడు ప్ర‌క‌టించింది. ఇది నాని 28వ సినిమా. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. మలయాళ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ సినిమాలో నజ్రియా తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకొంటుండటంతో ఆమె ఫ్యాన్‌కు పండగే. ఈ సినిమాతో డైరెక్ట్‌గా తెలుగులో నటిస్తుండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. ఈ సినిమాకు నికేత్‌ బొమ్మి సినిమాటోగ్రఫీ అందించనుండగా, సినిమాటోగ్రఫీ అందించనుండగా, డైరెక్టర్‌ వివేక్‌ రచయితగానూ మారారు. ఇప్పటికే 'బ్రోచేవారేవరురా', 'మెంటల్‌ మదిలో'వంటి హిట్‌ సినిమాలతో అతి తక్కువ కాలంలోనే వివేక్‌ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నవీన్ ఎర్నేని రవి శంకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం నాని 'టక్‌ జగదీష్‌' సినిమా చేస్తున్నారు.

Next Story
Share it