హీరో నితిన్..హీరోయిన్ కీర్తి సురేష్ ను చూస్తే 'ఏమిటో ఇది' అంటూ పాడుకుంటున్నారు. రంగ్ దే సినిమాకు సంబంధించిన తొలి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. 'ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసూలాట సాగుతున్నది. అందుకే ఈ మౌనమే భాష ఐనది' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.