Telugu Gateway
Cinema

స‌మంత అయినా..సామాన్యులైనా ఒక‌టే

స‌మంత అయినా..సామాన్యులైనా ఒక‌టే
X

యూట్యూబ్ ఛాన‌ళ్ల‌పై హీరోయిన్ స‌మంత వేసిన పిటీష‌న్ ను అత్య‌వ‌స‌రంగా విచారించాలంటూ ఆయ‌న త‌ర‌పు న్యాయ‌వాది చేసిన ప్ర‌య‌త్నాలను కోర్టు త‌ప్పుప‌ట్టింది. త‌న ప‌రువు, ప్ర‌తిష్ట‌ల‌కు భంగం క‌లిగించేలా మూడు యూట్యూబ్ చాన‌ళ్ళు క‌థ‌నాలు ప్ర‌సారం చేశాయ‌ని..వారిని నిలువ‌రించ‌ట‌మే కాకుండా బ‌హిరంగంగా క్షమాప‌ణ చెప్పేలా ఆదేశించాలంటూ ఆమె కూక‌ట్ ప‌ల్లి కోర్టులో పిటీషన్ దాఖ‌లు చేశారు. స‌మంత సెల‌బ్రిటీ అయినందున ఆమెను కించ‌ప‌ర్చేవారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకునేందు వీలుగా ఈ కేసు త్వ‌రగా వినాల‌ని న్యాయ‌వాది కోరారు.

దీనిపై అభ్యంత‌రం చెప్పిన న్యాయ‌మూర్తి కోర్టుకు స‌మంత అయినా..సామాన్యులైనా ఒక‌టేన‌ని వ్యాఖ్యానించారు. కోర్టు స‌మ‌యం చివ‌రిలో పిటీష‌న్ వింటామ‌న్నారు. నాగ‌చైత‌న్య‌తో వైవాహిక సంబంధానికి గుడ్ బై చెప్పిన త‌ర్వాత త‌న‌పై అస‌త్య క‌థ‌నాలు ప్ర‌సారం చేశార‌ని స‌మంత పిటీష‌న్ లో పేర్కొన్నారు. స‌మంత పిటీష‌న్ ను విచారించిన కోర్టు శుక్ర‌వారానికి తీర్పును వాయిదా వేసింది. పిటీష‌న్ పై విచార‌ణ పూర్తి అయింది.

Next Story
Share it