హీరో రామ్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ది వారియర్. ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం తొలి లిరికల్ బుల్లెట్ పాటను విడుదల చేసింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ దర్శకుడు లింగుస్వామి తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా, అక్షర గౌడ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కానుంది.ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ పాటను శింబు పాడారు.