Telugu Gateway
Cinema

హారిక ను ఉతికి ఆరేసిన నాగార్జున

హారిక ను ఉతికి ఆరేసిన నాగార్జున
X

బిగ్ బాస్ సీజన్ లో హారిక ఎప్పుడూ ఇంత సీరియస్ పమస్య ఎదుర్కొని ఉండదు. శనివారం నాటి షోలో హోస్ట్ నాగార్జున ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెను ఉతికి ఆరేశారు. హౌస్ సభ్యులు హారికను ఇటీవలే బెస్ట్ కెప్టెన్ గా ఎంపిక చేశారు. కానీ హారిక అసలు బెస్ట్ కెప్టెన్ ఎందుకు కాదో నాగార్జున వీడియోలు వేసి మరి చూపించి క్లాస్ తీసుకున్నారు. నాగార్జున క్లాస్ తో బిక్కమొహం వేయటం హారిక వంతు అయింది. కెప్టెన్సీని అభిజిత్ కు ఫేవర్ చేయటానికి వాడావే తప్ప...సభ్యులకు న్యాయం చేయటానికి ఉపయోగించలేదని నాగార్జున ఫైర్ అయ్యారు.

చివరకు హారిక చేసిన తప్పులేంటో ఆమెతోనే చెప్పించారు. ఎవరి ఆట వాళ్లు ఆడాలి తప్ప..మరొకరి కోసం చూడకూడదని..ఇప్పటికైనా తెలుసుకోవాలని నాగార్జున హితవు చెప్పారు. కెప్టెన్ అవటానికి సాయం చేసిన మోనాల్ ను వదిలేసి ఇతరులకు సాయం చేయటాన్ని కూడా నాగార్జున తప్పుపట్టారు. ముఖ్యంగా అబిజిత్ టాస్క్ లు ఆడకపోయినా ఏమీ చెప్పకుండా వదిలేయటం, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా వారించకపోవటం వంటి అంశాలపై క్లాస్ తీసుకున్నారు.

Next Story
Share it