Telugu Gateway
Cinema

బిగ్ బాస్..అందరి టార్గెట్ అరియానానే

బిగ్ బాస్..అందరి టార్గెట్ అరియానానే
X

సోమవారం అంటే బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల వ్యవహారం. ప్రతి వారం ఉండేదే. కాకపోతే ఈ సారి అందరూ అరియానానే టార్గెట్ చేశారు. ఏకంగా హౌస్ లో ఉన్న వారిలో ఏడుగురు అరియానాను నామినేట్ చేశారు. ప్రతి ఒక్కరూ అరియానా తీరును తప్పుపడుతూ నామినేట్ చేశారు. ఈ సమయంలో ఎప్పటిలాగానే వాదోపవాదాలు. అవినాష్ ఓ టాస్క్ లో విజేతగా నిలవటంతో ఈ వారం ఇమ్యునిటి వచ్చి..నామినేట్ వ్యవహారం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఈ వారం అరియానాతో పాటు మోహబూబ్, అభిజిత్, హారిక, మోనాల్, సోహైల్ లు నామినేషన్ లో ఉన్నారు. ఎలిమినేషన్ లో షుగర్ బాటిల్స్ తలపై కొట్టి నామినేషన్ చేశారు. అయితే నామినేషన్ల తర్వాత లాస్య తన తలపై గట్టిగా కొట్టిందని అరియానా ఆవేదన వ్యక్తం చేసింది. అవినాష్ తో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ అందరూ తనను టార్గెట్ చేశారని..తనకు ఇక ఇక్కడ ఉండాలని లేదంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it