Telugu Gateway
Cinema

బిగ్ బాస్ సండే సర్ ప్రైజ్

బిగ్ బాస్ సండే సర్ ప్రైజ్
X

తెలుగు బిగ్ బాస్ లో సండే సర్ ప్రైజ్. ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ కిచ్చా నాగార్జున ప్లేస్ లో ఎంట్రీ ఇచ్చారు. సభ్యులంతా ఆశ్చర్యంగా నాగార్జున ఎక్కడకు వెళ్ళారని అడిగితే ..ఆయన ఇంటికి వెళ్ళాడని..హౌస్ లోని కంటెస్టెంట్లు నాగార్జున బాగా అలసిపోయేలా చేస్తున్నారని చెబుతాడు. ఆయన ఎందుకు రావాలో మంచి కారణం చెప్పాలంటాడు సుదీప్. ఎందుకు అంటే వియ్ అల్ లవ్ నాగ్ సర్ అంటూ హారిక చెబుతుంది. ఆయన కుటుంబం మీకు అంటే ఎక్కువ ప్రేమిస్తుంది కదా ఆయన్ను అంటూ ఝలక్ ఇస్తాడు సుదీప్. నాగ్ సర్ ఈజ్ కింగ్..నాగ్ సర్ ఈజ్ బెస్ట్ అంటూ అభిజిత్ చెప్పటం..నీతో నేను ఏకీభవిస్తున్నా అంటూ సుదీప్ నాగార్జునను ఆహ్వానిస్తాడు.

సుదీప్ అవినాష్ ను ఓ ప్రశ్న అడుగుతాడు. హౌస్ లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఎవరితో డేట్ కు వెళతావు..ఎవరిని పెళ్ళి చేసుకుంటావు..ఎవరిని చంపేస్తావు అని ప్రశ్నించటంతో అవినాష్ చిక్కుల్లో పడతాడు. ఫస్ట్ సుదీప్ అఖిల్ ను ఏదో ప్రశ్న అడగటానికి రెడీ అవుతారు..అంతలోనే మళ్లీ మోనాల్ అని పిలవటంతో నాగార్జున వాళ్లిద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే అంటూ ఆట పట్టిస్తాడు.వాళ్లిద్దరి ఒకటే సమాధానాలు..ఒకటే ఆలోచనలు అని చెబుతాడు..దీనికి కొనసాగింపు సుదీప్ కూడా సేమ్ రెడ్ అంటూ ఇద్దరి డ్రెస్ లనుద్దేశించి వ్యాఖ్యానిస్తాడు.

Next Story
Share it