బిగ్ బాస్ తెలుగు విజేత అభిజిత్
ప్రచారమే నిజం అయింది. బిగ్ బాస్ తెలుగు విజేతగా అభిజిత్ నిలిచాడు. అఖిల్ రన్నరప్ గా నిలిచాడు. అట్టహాసంగా సాగిన కార్యక్రమంలో చిరంజీవి, నాగార్జున చేతుల మీదుగా అభిజిత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ విజేత ట్రోఫీని అందుకున్నాడు. విజేతకు బిగ్ బాస్ ఫైనలిస్ట్ ట్రోఫీని అందజేయటానికి ప్రత్యేక అతిధిగా మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. బిగ్ బాస్ ట్రోఫీ ఆవిష్కరణ సందర్భంగా చేసిన డ్యాన్స్ అదిరిపోయేలా ఉంది. అద్భుతమైన డ్యాన్స్ తో ఆకట్టుకున్నారు. అసలు బిగ్ బాస్ విజేత ఎవరో తెలవాల్సింది డిసెంబర్ 20న. అయితే కొన్ని నెలల ముందు నుంచే అభిజిత్ పేరు ప్రచారంలోకి వచ్చింది?. అది ఎలా సాధ్యం. కొన్ని పేర్లు ఊహించటం వరకూ అయితే ఓకే. కానీ పిన్ పాయింట్ గా అభిజిత్ విజేతగా నిలుస్తారు అని చెప్పటం అంటే ఖచ్చితంగా దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతాయి.
అభిజిత్ విజేత విషయాన్ని పక్కన పెడితే అరియానా గ్యారంటీగా రన్నరప్ గా నిలుస్తుందని అందరూ ఆశించారు. కానీ అదీ జరగలేదు. హౌస్ లో అరియానా కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు..కొన్నిసార్లు ఓవర్ గా చేసి ఉండొచ్చు. కానీ అందరూ పోయేదారిలో కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక దారి వేసుకుని మరి గట్టిగా..ధీటుగా నిలబడిన తీరు మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించుకోవాల్సిన అంశమే. నామినేషన్ల సమయంలో చాలా మంది తమ ఫ్రెండ్స్ ను ఫాలో అయ్యేవారు. కానీ అరియానా మాత్రం అందరూ వెళ్ళే దారికి భిన్నంగా వెళుతూ తన ప్రత్యేకతను చాటుకుంది.