Telugu Gateway
Cinema

నేను హాయ్ బ్రో...వాట్సప్ బ్యాచ్ కాదు

నేను హాయ్ బ్రో...వాట్సప్ బ్యాచ్ కాదు
X

బిగ్ బాస్..రచ్చ రచ్చగా నామినేషన్లు

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ల వ్యవహారం రచ్చ రచ్చగా మారింది. కెప్టెన్ గా ఎన్నికైన అఖిల్ కు ఇమ్యునిటీ లభించింది. అయితే అఖిల్ మాత్రం అబిజిత్, హారికలను నామినేట్ చేశాడు. అభిజిత్ ను నామినేట్ చేయటానికి కారణాలు చెబుతున్న సమయంలో జరిగిన వివాదం పీక్ కు వెళ్లింది. ఒకరినొకరు నీకు బుద్ధుందా..అంటే నీకు బుద్ధుందా అంటూ తిట్టుకున్నారు. బయటకు వెళ్లిపోయిన వ్యక్తి గురించి మంచిగా చెప్పకపోయినా పర్వాలేదు కానీ..వాళ్ల గురించి నవ్వుతూ మాట్లాడటం మంచిదికాదన్నారు. అయితే తాను మేకలా వెళ్ళి..ప్రొటీన్లు తిని...పులిలా బయటకు వచ్చానని వ్యాఖ్యానించాడు అఖిల్. అయితే దీనికి అభిజిత్ గట్టి కౌంటరే ఇచ్చాడు. మేక ఎప్పుడైనా బలి అవుతుందే తప్ప..పులిగా మారదన్నాడు. అఖిల్, అభిజిత్ లు నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ నానా హంగామా చేశారు. సోహైల్, హారికల మధ్య కూడా హాట్ హాట్ చర్చ జరిగింది. నాకు చిచ్చుబుడ్లు ఇచ్చిన వారందరికీ కృతజ్ణతలు అన్నాడు సోహైల్.

ఎవరూ దేకడు...వేస్ట్ గాడు అంటావా?. లాస్య అక్క కూడా మేం మాట్లాడుకుంటాం. చిచ్చు బుడ్డి ఇచ్చినందుకు ఫీల్ అవ్వలా..కానీ నువ్వు చెప్పిన రీజన్ బాగాలేదు. గింతంత లేవు కానీ..ఊర్కో అంటూ సోహైల్ హారికపై ఫైర్ అయ్యాడు. సోహైల్ మాట్లాడుతున్నంత సేపూ హారిక అరుస్తూనే ఉంది. ఆపు..ఏహె ఆపు అంటూ ఇద్దరూ గోలగోల చేశారు. అరియానా తన వంతుగా అభిజిత్, లాస్యలను నామినేట్ చేసింది. అభిజిత్, సోహైల్ ల మధ్య కూడా రచ్చ నడిచింది. సోహైల్ ను ఉద్దేశించి నేను అంతకు ముందు కూడా అలా మాట్లాడొద్దని చెప్పా అంటూ అభిజిత్ అంటే..నేను నాలాగే ఉంటా..కెమెరాలు ఉన్నాయని..హాయ్ బ్రో...వాట్స్ అప్ అంటూ పోష్ గా మాట్లాడాలా అంటూ సోహైల్ ఎద్దేవా చేశారు. ఫైనల్ గా అభిజిత్, మోనాల్, హారిక, లాస్య, అరియానా, సోహైల్ లు నామినేషన్ల జాబితాలో ఉన్నారు.

Next Story
Share it