Telugu Gateway
Cinema

బిగ్ బాస్ :మోనాల్ బయటకు..అరియానా ఫైనల్ కు

బిగ్ బాస్ :మోనాల్ బయటకు..అరియానా ఫైనల్ కు
X

అరియానా కష్టం ఫలించింది. టాస్క్ ల్లో సత్తా చాటిన అరియానా టాప్ ఫైవ్ లో నిలిచింది. ఇంత కాలం మోనాల్ ను కాపాడిన బిగ్ బాస్ చివరకు ఆమెను చివరి వారంలో బయటకు పంపాడు. మోనాల్ బయటకు పోతుందనే విషయం ముందే లీక్ అయింది. అయితే చివరి వరకూ మోనాలా? లేక అరియానా అన్న టెన్షన్ నెలకొంది. అయితే అరియానా ఫైనలిస్టుల జబితాలో చోటు దక్కించుకోవటంతో మోనాల్ బయటకు వచ్చేసింది. ఆట కంటే మాట్లాడితే ఏడుస్తూ ఉన్న మోనాలే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. శనివారం నాటి షోలో హోస్ట్ నాగార్జున అరియానా తీరుపై బాగానే ఫైర్ అయ్యారు. ఆటలో ఎందుకు జెండర్ ఇష్యూ తెచ్చావంటూ క్లాస్ తీసుకున్నాడు.

ముఖ్యంగా సోహైల్, అరియానాల మధ్య జరిగిన ఘర్షణ విషయంలో అరియానాను తప్పుపట్టాడు. సోహైల్ కోపం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఓవరాల్ గా చూస్తే అరియానానే బాగా టార్గెట్ అయింది. అయితే టాస్క్ ల్లో అరియానా చూపే తెగువ..అందరూ వెళ్ళేదారిలో కాకుండా ఖచ్చితంగా తాను అనుకున్న దాని ప్రకారమే ముందుకు సాగే అరియానా తీరు చాలా మంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. అదే ఆమెకు అభిమానులను సంపాదించి పెట్టడంతో పాటు ఓట్లు దక్కేలా చేసి టాప్ 5లో నిలిచేలా చేసిందని చెప్పొచ్చు.

Next Story
Share it