Telugu Gateway
Cinema

బిగ్ బాస్...మెహబూబ్ ఎలిమినేట్

బిగ్ బాస్...మెహబూబ్ ఎలిమినేట్
X

ఊహించినట్లే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. చివరిలో సోహైల్, మెహబూబ్ లే మిగిలారు. కానీ చివరకు మెహబూబ్ వంతు వచ్చింది. అయితే మెహబూబ్ ఎలిమినేషన్ సందర్భంగా హౌస్ లో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మెహబూబ్ ఎలిమినేషన్ విషయంలో సోహైల్ అయితే బోరున విలపించాడు. ఇది చాలా సేపు సాగింది. చివరకు హోస్ట్ నాగార్జున దగ్గర స్టేజీ మీదకు చేరినా కూడా సోహైల్ ఏడ్పు ఆపలేదు.

ఇంత‌కు ముందు సీజ‌న్ల‌లో ఎలిమినేష‌న్ జ‌రిగిన‌ప్పుడు ఏడుస్తుంటే కంటెస్టెంట్ల ఓవ‌రాక్ష‌న్ ఏంద‌ని ఎగ‌తాళి చేసేవాళ్లం. కానీ ఇక్క‌డ నిజంగా ఆ ఎమోష‌న్స్ ఏంటో తెలుస్తున్నాయి అని క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. బ్రెయిన్‌, మ‌న‌సు.. ఈ రెండింటితో కొట్లాడాల‌ని ఆవేద‌న వ్యక్తం చేశాడు. మొహబూబ్ వెళుతూ వెళుతూ కూడా స్టేజ్ పై ఓ పాటకు డ్యాన్స్ చేసి అందరికీ వీడ్కోలు పలికాడు.

Next Story
Share it