Telugu Gateway
Cinema

బిగ్ బాస్ లో శ్రీముఖి..గీతా మాధురి సందడి

బిగ్ బాస్ లో శ్రీముఖి..గీతా మాధురి సందడి
X

బిగ్ బాస్ తెలుగు షో ఈ ఆదివారం తో ముగిసిపోనుంది. మరి చివరి వారంలో ఏదో కొంత కొత్త సరదా కావాలి కదా?.అందుకే బిగ్ బాస్ షోలో గతంలో పాల్గొన్న శ్రీముఖి, గీతామాధురి, హరితేజ, అలీలను రంగంలోకి దింపారు. వీరితో హౌస్ లో ఉన్న సభ్యులతో ముఖాముఖి పెట్టి సందడి చేశారు. చూస్తుంటే ఈ చివరి వారం కాస్త షోపై మరింత క్రేజ్ పెంచే ఏర్పాట్లలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు కన్పిస్తోంది. శ్రీముఖి హౌస్ లో ఉన్న అభిజిత్ ను పిలవగానే...ఆయన తనదైన శైలిలో మీరంతా ఎంత బాగున్నారో..సచ్ ఏ ప్లెజర్ టూ సీ యూ అనటంతోనే...హరితేజ సీరియస్ గా వదలడండి..ఆయన మనల్ని కూడా వదలడు అంటూ చెప్పిన డైలాగ్ తో అందరూ సరదాగా నవ్వుకుంటారు.

శ్రీముఖి మళ్ళీ అఖిల్ తో మాట్లాడుతూ ఏంటి మోనాల్ వెళ్లిపోయిన తర్వాత సైలంట్ అయిపోయినట్లు ఉన్నావు అంటూ ఆట పట్టిస్తుంది. వెంటనే సోహైల్ జోక్యం చేసుకుని అదేమి లేదు ..సైలంట్ కాదు..ఆల్రెడీ వాళ్లిద్దరికీ (హారిక, అరియానాలకు) సోపులేస్తున్నాడు అంటూ ఓ ఝలక్ ఇస్తాడు. అదేమి లేదంటూ అఖిల్ చేతులెత్తేసి దండం పెడతాడు. అరియానా కోపంపై కూడా ఈ ప్రత్యేక అతిధులు ఓ ఆట ఆడుకుంటారు. సోహైల్ ను నీకు ఎలాంటి అమ్మాయి కావాలి పెళ్ళి చేసుకోవటానికి అంటే..నాకు కోపం వచ్చినప్పుడు తట్టుకుని కంట్రోల్ చేసే అమ్మాయి అయితే బాగుంటుందని చెబుతాడు..అలాంటి వాళ్లు దొరకటం కష్టం అని అందరూ తేల్చేస్తారు.

Next Story
Share it