Telugu Gateway
Cinema

సోహైల్ కు చిచ్చుబుడ్డి...అరియానాకు ఆటం బాంబు

సోహైల్ కు చిచ్చుబుడ్డి...అరియానాకు ఆటం బాంబు
X

బిగ్ బాస్ లో హోస్ట్ నాగార్జున దీపావళి సందడి తెచ్చారు.. జీవితమే దీపావళి అంటూ వెలుగులతో ఎంట్రీ ఇచ్చారు. వ్యక్తిగతంగా అమల తెప్పించారు అంటూ దీపావళి టపాసులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఒక్కో టపాసు క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారో చెప్పాలంటూ కోరటంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. చిచ్చుబుడ్డి ఎవరు సూట్ అవుతుందో చెప్పాలని కోరితే..లాస్య సోహైల్ కు అందజేస్తుంది చిచ్చుబుడ్డిని. నాగార్జున కూడా లాస్యను అంటీ..అంటీ కొద్దిసేపు ఆటపట్టిస్తారు. సర్..అన్నిసార్లు మీరు కూడా అంటీ అనమాకండి అంటూ లాస్య అనగానే...నాగార్జున రియాక్ట్ అయి నువ్వు మాత్రం చీమ,ఏనుగు కథ చెప్పొచ్చా అంటూ ఝలక్ ఇస్తారు.

మధ్యలో అవినాష్ జోక్యం చేసుకుని సర్..ఏమన్నారు నాకు అర్ధం కాలేదు అంటూ మళ్ళీ అంటీ అన్పించే ప్రయత్నం చేస్తారు. అవినాష్ ఆటంబాబును అరియాకు అందిస్తాడు. వెంటనే నాగార్జున మాట్లాడుతూ నువ్వు ఆటంబాంబు ఇచ్చినా కూడా పడదు అంటూ కామెంట్ చేస్తారు. అంతే కాదు..మెహబూబ్ అవునా కాదు నువ్వు చెప్పు అంటూ అడిగితే..తన ట్రై తాను చేస్తున్నాడు సర్ అంటూ చెబుతుంటే...నిజం చెప్పు అంటూ అవినాష్ ఆగమాగం అవుతాడు. ఇలా దీపావళి పండగ రోజు బిగ్ బాస్ షో ఎలా ఉండబోతుందో ప్రమోలో చూపించారు.

Next Story
Share it