Telugu Gateway
Cinema

బిగ్ బాస్ ...అవినాష్ ఎలిమినేట్

బిగ్ బాస్ ...అవినాష్ ఎలిమినేట్
X

ఎంటర్ టైనర్ అన్నారు. బయటకు పంపారు. వారం వారం కాదు..కాదు..ప్రతి రోజూ ఏడ్చే మోనాల్ మాత్రం ప్రతి వారం నామినేషన్లలో ఉంటుంది...కానీ సేవ్ అవుతూనే ఉంటుంది. అసలు ఈ లెక్కలు ఏందో ఓ పట్టాన అర్ధం కాదు. కానీ ఈ ఆదివారం మాత్రం ఎలిమినేషన్ రౌండ్ లో చివరిగా మోనాల్, అవినాష్ లు మిగిలారు. కానీ చివరకు అవినాష్ మాత్రమే ఎలిమినేట్ అయ్యాడు. వెళుతూ..వెళుతూ కూడా అవినాష్ సరదాగానే ప్రేక్షకులను నవ్వించి బయటకు వెళ్ళాడు.

నాగార్జునతో కలసి వేదిక మీద హౌస్ లో సభ్యులు అందరూ ఎలా వ్యవహరిస్తారో చేసి చూపించి నవ్వులు పూయించాడు. ఆదివారం నాడు బిగ్ బాస్ షోలో ఏదైనా సందడిగా సాగింది అంటే..అది అవినాష్ చేసింది మాత్రమే. అంతకు ముందు నామినేషన్లలో ఉన్న వారిని సేవ్ చేయటానికి ఆవు, విజిల్ వంటితో కథ నడిపించారు. ఇప్పటివరకూ టికెట్ టూ ఫినాలేకు పోయిన ఏకైక వ్యక్తి అఖిల్ మాత్రమే. అవినాష్ నామినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు మాత్రమే మిగిలారు.

Next Story
Share it