Telugu Gateway
Cinema

బిగ్ బాస్ హౌస్ లో 'పాల కోసం ఫైటింగ్'

బిగ్ బాస్ హౌస్ లో పాల కోసం ఫైటింగ్
X

బిగ్ బాస్ లో రేస్ టూ ఫినాలే మొదలైంది . ఫినాలే మెడల్ లభించిన సభ్యుడు నేరుగా ఫినాలేలోకి ఎంటర్ అవుతాడు. దీని కోసం ఓ టాస్క్ పెడతారు హౌస్ లో. అది ఏంటి అంటే ఓపెన్ ప్లేస్ లో ఓ ఆవును పెడతారు. ఆ అవు నుంచి పాలు పట్టుకుని ఎక్కువ పాలు ఎవరి దగ్గర ఉంటే వారే విన్నర్స్ అని ప్రకటించాడు బిగ్ బాస్. అంతే సభ్యుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఒకరినొకరు తీసుకోవటం..నెట్టుకోవటం..పాల కోసం పోరాటం. తోపులాటలో అవినాష్ చేతిలో ఉన్న పాల డబ్బా పడిపోయి కొన్ని పాలు ఒలికిపోతాయి. దీంతో ఫ్రస్టేషన్ కు వచ్చిన అవినాస్ బిగ్ బాస్ ఇది నాకొద్దు అంటూ దండం పెడతాడు. అంతకు ముందు అవినాష్ కూడా వేరే వాళ్ళ బాటిల్ ను తోసినట్లు కన్పిస్తుంది. నువ్వు పట్టుకున్నది డబ్బా..మేం చిన్న చిన్నవి పట్టుకున్నాం అని సోహెల్..అవినాష్ లు గొడవ పడతారు.

అందరూ కలసి ఒకటి అవుతున్నరు అంటూ అవినాష్ విమర్శిస్తాడు. అందరూ కలసి ఒకటి ఏమీ అవ్వలేదు అంటూ అఖిల్ అవినాష్ ఆరోపణలపై తీవ్రంగా స్పందిస్తాడు. ఏహ్..ఆగు అంటూ సోహైల్ పిలుస్తున్నా కూడా అవినాష్ సీరియస్ గా ముందుకు వెళతాడు. చూస్తుంటే బిగ్ బాస్ లో మంగళవారం నాడు కూడా రచ్చరచ్చ నడిచేలా కన్పిసతోంది. సోమవారం నాడు నామినేషన్ల వ్యవహారంలో కూడా హాట్ హాట్ డిస్కషన్స్ జరిగాయి సోహైల్, అరియానాలు తప్ప అందరూ నామినేట్ అయ్యారు ఈ వారం. బిగ్ బాస్ షో ముగింపు దశకు వస్తుండటంతో ఎవరికి వారు తమను కాపాడుకునేందు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story
Share it