బిగ్ బాస్...అమ్మ రాజశేఖర్ ఔట్
బిగ్ బాస్ కార్యక్రమంలో ఆదివారం నాడు సుమ సందడి చేసింది. ప్రొమోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ చెప్పిన నాగార్జున...షో అంతా కూడా హౌస్ సభ్యులను కూడా అదే భ్రమలో ఉంచారు. హౌస్ లోకి వెళ్లినట్లే వెళ్ళిన సుమ మళ్ళీ వెనక్కి వచ్చిన సుమ ..మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్,ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు చాలా ఉన్నాయని తనకు ఫోన్ వచ్చిందని అంటూ షాక్ ఇచ్చింది. కేవలం ఆదివారం కార్యక్రమం కోసమే సుమ ఎంట్రీ ఇఛ్చిందని అర్ధం అయిపోయింది. తర్వాత సాగిన కార్యక్రమంలో ఎలిమినేషన్ లో చివరకు అమ్మరాజశేఖర్, అవినాష్ లు మిగిలారు.
నాగార్జున ఓ దశలో డబుల్ ఎలిమినేషన్ అంటూ షాకిచ్చారు. కానీ అవినాష్ ను స్టోర్ రూమ్ లో ఉంచి సేవ్ చేశారు. దీంతో ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న అమ్మ రాజశేఖర్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి అమ్మ రాజశేఖర్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఆయన వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలైంది. అవినాష్, నువ్వు ఉంటావంటూ భరోసా ఇచ్చాడు అమ్మ రాజశేఖర్. ఆయన చెప్పినట్లే అవినాష్ సేవ్ అయ్యారు.