Telugu Gateway
Cinema

వచ్చే నెలలో సాలార్..ప్రాజెక్ట్ కె సందడి

వచ్చే నెలలో సాలార్..ప్రాజెక్ట్ కె సందడి
X

జులై నెల ప్రభాస్ ఫాన్స్ దే. ఎందుకంటే రెండు కీలక సినిమాలకు సంబంధించిన సందడి వచ్చే నెలలో ప్రారంభం కానుంది. భారీ అంచనాల మధ్య జూన్ లో విడుదల అయిన ఆదిపురుష్ సినిమా ఓపెనింగ్స్ విషయంలో దుమ్మురేపింది. ఈ సినిమాపై తలెత్తిన వివాదాలు తర్వాత కలెక్షన్స్ పై దెబ్బ వేశాయనే చెప్పాలి. కెజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా అందరి ద్రుష్టి తన వైపు తిప్పుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, అయన దర్శకత్వంలోనే సాలార్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఒక వైపు పాన్ ఇండియా హీరో ప్రభాస్, మరో వైపు కెజీఎఫ్ 2 తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు తెరకెక్కించిన సినిమా కావటంతో సాలార్ పై ఫాన్స్ లో దీనిపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయనే చెప్పాలి.

ఈ సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. దీంతో జులై మొదటివారంలో సాలార్ సినిమా టీజర్ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. మహానటి సినిమాతో సంచలన విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సినిమానే ప్రాజెక్ట్ కె. వైజంతి మూవీస్ నిర్మాణ సంస్థ. ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను జులై 3 న అమెరికాలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు ఇలా రెండు కీలక సినిమాల అప్ డేట్స్ తో ప్రభాస్ ఫాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Next Story
Share it