Telugu Gateway
Cinema

భగత్ సింగ్ ఓల్డ్ సిటీ పోలీస్ అధికారా?!

భగత్ సింగ్ ఓల్డ్ సిటీ పోలీస్ అధికారా?!
X

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తన సినిమా కోసం అల్లూరి సీతా రామరాజు తుపాకుల కోసం బ్రిటీష్ వాళ్ళ దగ్గర పని చేసినట్లు చూపిస్తారు. ఇప్పుడు మరో దర్శకుడు హరీష్ శంకర్ భగత్ సింగ్ సినిమాకు అదే స్ఫూర్తి తీసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే అయన తన కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో భగత్ సింగ్ క్యారక్టర్ వేసిన పవన్ కళ్యాణ్ ను పాతబస్తీ పత్తర్ గంజ్ లోని మహంకాళి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారి గా చూపించారు. అసలు ఈ భగత్...భగత్ సింగ్ కు స్వాతంత్ర సమరయోధుడు..విప్లవకారుడు భగత్ సింగ్ కు సంబంధం ఉందో లేదో తెలియదు కానీ తెలుగు సినిమా దర్శకులు మాత్రం దేశం గర్వించదగ్గ. జాతీయోద్యమ మహానీయులను మాత్రం తమ వాణిజ్య సినిమాల కోసం ఇష్టానుసారం వాడుకుంటున్నారు. అదేమంటే ఇది కేవలం కల్పితం.. పేరు మాత్రమే తీసుకున్నాం అంటూ సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజును రాజమౌళి బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేసినట్లు చూపించగా ..ఇప్పుడు హరీష్ శంకర్ భగత్ సింగ్ ను ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ లో అధికారిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

తొలుత అయన ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అని పేరు పెట్టి తర్వాత దీన్ని ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చిన విషయం తెలిసిందే. ఈ టైటిల్ పై కూడా సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఇవే కాకుండా మరో హీరో నిఖిల్ సిద్దార్థ్ కూడా ఇప్పుడు మరో స్వాతంత్ర సమరయోదుడు సుభాష్ చంద్ర బోస్ జీవిత చరిత్ర ఆధారంగా స్పై పేరుతో సినిమా తీస్తున్నారు. ఇందులో కేవలం పది శాతం మాత్రం కల్పితాలు ఉంటాయని...మిగిలిన అంశాలు అన్ని ప్రభుత్వ రికార్డు ల ప్రకారమే తాము ముందుకు పోతున్నట్లు నిఖిల్ తాజాగా వెల్లడించారు. సినిమా విడుదల అయితే కానీ అందులో నిజాలు ఏమిటో తెలియదు. ఇలా తెలుగు దర్శకులు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు జాతీయోద్యమ నాయకుల చరిత్రను వక్రీకరిస్తూ తమ సినిమాలతో లాభాలు దండుకునే పనిలో పడ్డారు. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ విజయవంతం అయింది. మరో ఈ ఉస్తాద్ భగత్ సింగ్, స్పై సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.

Next Story
Share it