Telugu Gateway
Cinema

త్వ‌ర‌లోనే ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్ల విక్ర‌యం

త్వ‌ర‌లోనే ఆన్ లైన్ ద్వారా సినిమా టిక్కెట్ల విక్ర‌యం
X

సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌తినిధుల‌తో ఏపీ ర‌వాణా, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల మంత్రి పేర్ని నాని సోమ‌వారం నాడు స‌మావేశం అయ్యారు. ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వివిధ విభాగాల వారు ఇందులో పాల్గొన్నారు. త్వ‌ర‌లోనే ఆన్ లైన్ వ్య‌వ‌స్థ ద్వారా టిక్కెట్ల విక్ర‌యాలు ప్రారంభిస్తామ‌ని మంత్రి పేర్ని నాని తెలిపారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ప్ర‌తినిధులు వివరించారని తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే టికెట్ల విక్రయాలు ఉంటాయ‌ని ప్రకటించారు. పారదర్శకత కోసమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని పేర్ని నాని తెలిపారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి.కళ్యాణ్, ఆదిశేషగిరిరావు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, దిల్ రాజు, డివివి దానయ్య, రామ సత్యనారాయణ, ముత్యాల రామదాసులతో పాటు పంపిణీ దారులు, థియేటర్ యజమానులు పేర్ని నానితో స‌మావేశానికి హాజరయ్యారు. స‌మావేశం అనంత‌రం నిర్మాత సి.కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలన్నింటిని ఓపిగ్గా విని పరిష్కారం చూపుతామని మంత్రి పేర్ని నాని వెల్లడించినట్లు పేర్కొన్నారు. దివంగత వైఎస్సార్‌ సినీ ఇండస్ట్రీకి ఎంతో చేశారని నేడు సీఎం జగన్‌ కూడా అలాగే చేయాల‌ని కోరిన‌ట్లు తెలిపారు. ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం తామే అడిగామని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు.

దానితో పాటు 4 షోలు 12 గంటలలోపు పూర్తి చేయడంపై చర్చించినట్లు తెలిపారు. విద్యుత్ బిల్లుల అంశం, 100 శాతం ఆక్యుపెన్సీపై కూడా చర్చించామన్నారు. అన్ని వర్గాలు ఈ రోజు చర్చల పట్ల ఆనందంగా ఉన్నాయని, ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు. సినిమా ఇండస్ట్రీకి కావాల్సినవి అన్ని ప్రభుత్వం చెప్పిందని త్వరలోనే సీఎం జగన్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. ఆన్‌లైన్‌​ విధానం వలన సినీ పరిశ్రమకి మేలు జరుగుతుందని నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంతో పాటు రేట్లు సవరించని కోరినట్లు తెలిపారు. అన్ని సమస్యలపై మంత్రి తో చర్చించామని, ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తామని చెప్పిందని వెల్లడించారు. సినిమా సమస్యలపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని నిర్మాత డీఎన్‌వీ ప్రసాద్‌ పేర్కొన్నారు. సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యలపై మంత్రి పేర్ని నాని, అధికారులతో చర్చ జరిగిందని దీనివల్ల తెలుగు సినిమా పరిశ్రమకు మంచి జరుగుతుందన్నారు. తప్పనిసరిగా మరొక సమావేశం ఉంటుందని తెలిపారు. చిన్నా, పెద్ద సినిమా కాకుండా ప్రభుత్వం దగ్గర ఉన్న డౌట్స్ క్లారిఫై చేశామని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ టికెట్ వ్యవస్థ అనేది పెద్ద సమస్య కాదని అన్నారు.

Next Story
Share it