Telugu Gateway
Cinema

బిగ్ బాస్ హౌస్ లో 'సుమ సందడి'

బిగ్ బాస్ హౌస్ లో సుమ సందడి
X

సుమ. ఎక్కడ ఉంటే అక్కడ సందడే. గత కొన్ని వారాలుగా ఎలాంటి సరదాలు లేకుండా చప్పగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనుందా?. అంటే ఔననే చెబుతున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున. దీనికి సంబంధించిన ప్రొమోను మా టీవీ విడుదల చేసింది. ఇందులో సుమ సందడి ఓ రేంజ్ లో ఉంది. హౌస్ లోని సభ్యులందరిపై వస్తూనే పంచ్ లు వేసింది సుమ. సభ్యులపై వేస్తే ఓకే. చివరకు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు కూడా షాక్ లు ఇచ్చింది. ఎలాగంటే చివరకు ఆయనపై కూడా పంచ్ లు వేసింది. దీంతో నాగార్జున అలిగి వెళ్లే ప్రయత్నం ...మళ్లీ వెనక్కి రావటం అంతా సరదా సరదాగా నడిచిపోయింది.

చూస్తుంటే ఈ సండే బిగ్ బాస్ లో సుమ సందడి బాగానే ఉండేలా ఉంది. అయితే సుమ సూట్ కేసు తీసుకుని వచ్చింది అంటే నిజంగానే సుమ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందా లేక ఇది సందడి కోసం చేశారా అన్నది వేచిచూడాల్సిందే. సుమగారు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మిమ్మల్ని అని అవినాష్ అంటే..నాగార్జున..ఏహ్..ఊరుకో నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని ఝలక్ ఇచ్చారు నాగార్జున. అరియానా, మోనాల్ ను సమ ఇమిటేట్ చేసిన విధానం ఆకట్టుకుంది. చూడాలి మరి సుమ హౌస్ లో ఎంత సందడి తెస్లారో.

Next Story
Share it