Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ బీట్ చేయటానికి పుష్ప 2 ప్లాన్స్ !

ఆర్ఆర్ఆర్ బీట్ చేయటానికి పుష్ప 2 ప్లాన్స్ !
X

అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ సినిమాను బీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారా?. అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమాకు సంబంధించి అన్ని హక్కులు కలుపుకుని 1050 కోట్ల రూపాయలు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా హక్కులనే మొత్తం 750 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు టాక్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్ఆర్ఆర్ ని మించి తమ సినిమాకు వ్యాపారం జరగాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఇద్దరు హీరో లు ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. దర్శకుడు రాజమౌళి. పుష్ప ది రైజ్ ప్రపంచ వ్యాప్తంగా 365 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. ఇప్పుడు పుష్ప 2 మాత్రం భారీ టార్గెట్ పెట్టుకున్నారు. దక్షిణాదిలో 250 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ 100 కోట్ల రూపాయలు, హిందీ 400 కోట్ల రూపాయలు, డిజిటల్ అండ్ శాటిలైట్ హక్కులు 300 కోట్ల రూపాయలుగా ఫిక్స్ చేసినట్లు చెపుతున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే నిర్మాతలతో సంబంధం లేకుండా బిజినెస్ అంతా అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ చేసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అదే సమయంలో బాలీవుడ్ హీరోలు కూడా అల్లు అర్జున్ నటనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. పుష్ప తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ మార్కెట్ పెరిగింది అనటంలో సందేహం లేదు. అయితే మరి ఆర్ఆర్ఆర్ ను దాటేసి బిజినెస్ చేయటంతో పాటు వసూళ్లు ఏ మేరకు సాధిస్తుంది అన్నది వేచిచూడాలి.

Next Story
Share it