Telugu Gateway
Cinema

అమెరికాలో త‌మ‌న్ మ్యూజిక్ కార్నివాల్

అమెరికాలో త‌మ‌న్ మ్యూజిక్ కార్నివాల్
X

క‌రోనాతో అల్లాడిన అమెరికా పూర్తిగా రిక‌వ‌రి బాట‌న సాగుతోంది. దీంతో మ‌ళ్లీ సాధార‌ణ కార్య‌క్ర‌మాలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అమెరికాలో వ్యాక్సినేష‌న్ అత్యంత వేగంగా పూర్తి కావ‌టంతో ప‌రిస్థితులు చాలా వ‌ర‌కూ కుదుట‌ప‌డ్డాయి. ఈ త‌రుణంలో ప్ర‌ముఖ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ త‌మ‌న్ అమెరికాలో మ్యూజిక్ షో నిర్వ‌హించేందుకు రెడీ అవుతున్నారు. ఆగ‌స్ట్-సెప్టెంబ‌ర్ నెల‌ల్లో అమెరికాలో మ్యూజిక్ కార్నివాల్‌ 'అల అమెరికాపురములో..' పేరుతో నిర్వ‌హించ‌నున్నారు.

హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ మ్యూజికల్‌ కార్నివాల్‌ని ఏర్పాటు చేయనుంది. వాషింగ్టన్‌ డి.సి., చికాగో, న్యూజెర్సీ, శాన్‌ జోస్‌ మరియు డల్లాస్‌లో తమన్‌ తన బృందంతో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ కాన్సర్ట్‌కు టాలీవుడ్‌కి చెందిన ఓ ప్ర‌ముఖ‌ డైరెక్టర్‌తో పాటు ఓ స్టార్‌ హీరో ముఖ్య అతిథిగా హాజరు కానున్నార‌న స‌మాచారం. హంసిని ఎంటర్‌టైన్‌మెంట్‌ గతంలో ప్ర‌ముఖ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ల‌తో క‌ల‌సి ఇలాంటి షోలు నిర్వ‌హించింది.

Next Story
Share it