Telugu Gateway
Cinema

'ఆచార్య' సినిమా విడుదల వాయిదా

ఆచార్య సినిమా విడుదల వాయిదా
X

కరోనా కారణంగా 'ఆచార్య' సినిమా విడుదల వాయిదా పడింది. వాస్తవానికి ఈ సినిమా మే 13న విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనేది సాధారణ పరిస్థితులు నెలకొన్నాక ప్రకటిస్తామని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అధికారికంగా ట్వీట్ చేసింది. అయితే ఇప్పడు చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 సందర్భంగా సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టాక్.

ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కరోనా కారణంగా ఇఫ్పటికే పలు సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా రెండవ దశకు దేశమంతటా తీవ్ర సంక్షోభం నెలకొంది. దీంతో దేశ వ్యాప్తంగా పలు సినిమాల షూటింగ్ లు కూడా ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి.

Next Story
Share it