సినిమా సమస్యలకు శుభం కార్డు
ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖుల భేటీ విజయవంతం అయింది. అందుకే ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలకు శుభంకార్డు పడిందని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని అన్నారు. పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ కు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.విశాఖను సినిమా హబ్‌గా తయారు చేస్తామన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈనెల చివర్లో జీవో వచ్చే అవకాశం ఉంది. సమావేశం ఏర్పాటు చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించిన సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నానికి ధన్యవాదాలు' అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. గత ఆరు, ఏడు నెలలుగా సినీ పరిశ్రమ సందిగ్ధంలో పడిపోయింది.
అలాంటి సమయంలో చిరంజీవి గారు ముందడుగు వేసి మాకు దారి చూపించారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు. ఈరోజు జరిగిన సమావేశం చాలా పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. వారం, పది రోజుల్లో గుడ్‌న్యూస్ వింటాం. సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం జగన్‌కు, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు' అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు తెలిపారు. దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ 'ముందుగా సీఎం జగన్‌కి ధన్యవాదాలు. అందరి అభిప్రాయాలు ఎంతో ఓపిగ్గా విన్నారు. ఇక గత కొన్నాళ్లుగా సందిగ్ధంలో ఉన్న సమయంలో పరిష్కారం దిశగా చిరంజీవి దాన్ని ముందుకు తీసుకుళ్లారు. ఆయనకు ఇష్టం ఉండదు కానీ ఇండస్ట్రీ పెద్దగా చిరంజీవి నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని వినియోగించి ఇంత పెద్ద సమస్య పరిష్కారమయ్యేలా కృషి చేశారు' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్, కొరటాల శివతోపాటు ఇతర సినిమా ప్రముఖులు పాల్గొన్నారు.