Top
Telugu Gateway

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్
X

గత కొంత కాలంగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతి రోజూ మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోపాటు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో శుక్రవారం నాడు ఏపీ సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెక్షన్ 24 కింద అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే తొలుత రఘురామకృష్ణంరాజుకు రక్షణగా కేంద్ర బలగాలు సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవటాన్ని అడ్డుకున్నారు. అయితే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నాడు రఘురామకృష్ణంరాజు పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సమయంలో పోలీసులు నోటీసులు ఇచ్చి ఆయన్ను తీసుకెళ్ళారు. రఘురామకృష్ణంరాజును సీఐడీ పోలీసులు మంగళగిరిలోని ఏపీసీఐడీ కార్యాలయానికి తీసుకెళ్ళినట్లు సమాచారం.

Next Story
Share it