Telugu Gateway
Andhra Pradesh

తిరుపతిలో వైసీపీ ఘన విజయం

తిరుపతిలో వైసీపీ ఘన విజయం
X

ఊహించినట్లే తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ ఘన విజయం సాధించింది. తొలి నుంచి ఇక్కడ అధికార పార్టీ గెలుపుపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేకపోయినా మెజారిటీ ఎంత వస్తుందనే దానిపైనే ఎక్కువ చర్చ సాగింది. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ గురుమూర్తి 2 లక్షల 71 వేల 592 ఓట్ల మెజార్టీతో గెలుపు పొందారు. తిరుపతి లోక్ సభ బరిలో టీడీపీ తరపున కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, బిజెపి-జనసేనల తరపున రిటైర్డ్ ఐఏఎస్ కె. రత్నప్రభలు బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

బిజెపిని గెలిపిస్తే ఏపీకి కేంద్ర మంత్రి పదవి వస్తుందని బిజెపి నేతలు ప్రచారం చేసినా ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. తొలుత తిరుపతి సీటు కోసం పట్టుబట్టి..తర్వాత రాజీపడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా రత్నప్రభ కోసం ప్రచారం నిర్వహించినా ఆ ప్రభావం ఎక్కడా ఫలితాల్లో కన్పించలేదు. తిరుపతి ఉప ఎన్నికలో మరో విశేషం ఏమిటంటే గతంలో సాధించిన మెజారిటీ కంటే గురుమూర్తికి అధిక మెజారిటీ దక్కింది. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి మంత్రులు తాము ఐదు లక్షల మెజారిటీ సాధిస్తామని ప్రకటించారు. అయితే ఆ మంత్రుల లెక్కలు మాత్రం తప్పాయి.

Next Story
Share it