కేంద్ర బడ్జెట్ అనే కంటే..రాష్ట్రాల ఎన్నికల బడ్జెట్ అనటం బెటర్
కేంద్ర బడ్జెట్ పై వైసీపీ అసంతృప్తి చేసింది. ఆ పార్టీ పార్లమెంటర్టీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దీన్ని కేంద్ర బడ్జెట్ అనే కంటే..బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు బడ్జెట్ అంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు ఉందని విమర్శించారు. ఈ బడ్జెట్‌త తమను పూర్తిగా నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించి... ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు. ఏపీలో మెట్రో రైలు కోసం కేంద్రాన్ని ఆరేళ్లుగా కోరుతున్నామని తమ విజ్ఞప్తుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని అసంతప్తి చెందారు. కొత్త టెక్స్ టైల్ పార్క్ కావాలని కోరామని దానికి సంబంధించి బడ్జెట్‌లో ఏమాత్రం కేటాయింపులు లేవన్నారు.
పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ఫ్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. ద్రవ్యోల్బణం పెరిగినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదన్నారు. రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సహాయాన్ని పదివేలకు పెంచాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను కూడా ఆరోగ్యశ్రీ తరహాలో మార్చాలని అన్నారు.