మాజీ మంత్రి సుబ్బారాయుడిపై వైసీపీ వేటు

గత కొంత కాలంగా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళం విన్పిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిపై వైసీపీ వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో తాను నరసాపురం నుంచి పోటీచేసి తీరుతానని..ఏ పార్టీ నుంచి అనేది తర్వాత ప్రకటిస్తానని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ అధిష్టానం చర్యలకు దిగింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రసాదరాజు తీరుపై ఆయన బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నరసాపురం జిల్లా సాధన సమితి ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయనపై కేసు కూడా నమోదు అయింది. గత ఎన్నికల్లో ప్రసాదరావు గెలుపునకు సహకరించి తప్పు చేశానంటూ కొద్ది రోజుల క్రితం ఆయన బహిరంగంగా తన చెప్పుతో తానే కొట్టుకుని కలకలం రేపారు.
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTజాన్సన్ అండ్ జాన్సన్ పై 38 వేల కేసులు
13 Aug 2022 7:24 AM GMTగౌతమ్ అదానికి జెడ్ కేటగిరి భద్రత
13 Aug 2022 6:41 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTకొత్త రికార్డు క్రియేట్ చేయనున్న ఢిల్లీ విమానాశ్రయం
11 Aug 2022 9:28 AM GMT
ఫిక్స్ చేసేందుకు రేవంత్..ఎగ్జిట్ కోసం కోమటిరెడ్డి!
13 Aug 2022 9:12 AM GMTరేవంత్ రెడ్డి క్షమాపణ
13 Aug 2022 5:33 AM GMTమునుగోడులో కెసీఆర్ హుజూరాబాద్ కసి తీర్చుకుంటారా!
8 Aug 2022 12:45 PM GMTకోమటిరెడ్డి.. ఈటెల రాజేందర్ కాగలరా?!
8 Aug 2022 11:49 AM GMTమునుగోడు ఉప ఎన్నిక..టీఆర్ఎస్ అనుకుంటే వస్తది..లేదంటే లేదు!
2 Aug 2022 2:38 PM GMT