Telugu Gateway
Andhra Pradesh

విజయసాయిరెడ్డి క్షమాపణ

విజయసాయిరెడ్డి క్షమాపణ
X

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం నాడు రాజ్యసభలో ఛైర్మన్ వెంకయ్యనాయుడికి క్షమాపణ చెప్పారు. సోమవారం నాడు సభలో తాను చేసిన వ్యాఖ్యలు ఉధ్దేశపూర్వకంగా చేసినవి కావని, వాటిని తాను ఉపసంహరించుకుంటున్నాని ప్రకటించారు. రాజ్యసభ చైర్మన్ ను అగౌరవ పరచాలనుకోలేదని, సభా చైర్మన్ కు ఉద్దేశాలు ఆపాదించాలనుకోలేదని...ఆవేశంలో మాట్లాడాను తప్ప ఉద్దేశపూర్వకంగా కాదన్నారు. భవిష్యత్ లో ఈ విదంగా జరగకుండా చూసుకుంటానన్నారు. సోమవారం నాడు సభలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటరి వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ వాటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో రాజ్యసభ చైర్మన్ కు క్షమాపణలు చెప్పాలన్న ప్రహ్లాద్ సూచించారు. దీంతో విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ సభలో మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు.

ఇది జరిగిన తర్వాత విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ అని..సభలో లేని వ్యక్తిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. అయితే మాట్లాడే సమయంలోనే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాలని..ఇప్పుడు కాదని..లేఖ రాస్తే తాను పరిశీలించి అభ్యంతరకర అంశాలు తొలగిస్తానని ప్రకటించారు. అయినా సరే విజయసాయిరెడ్డి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడిని ఉద్దేశించి మీ మనసు బిజెపిపైన..తనువు టీడీపీవైపు అంటూ వ్యాఖ్యనించారు. ఇది సభలో పెద్ద దుమారమే రేపింది. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అయితే మంగళవారం నాడు విజయసాయిరెడ్డి క్షమాపణలు చెప్పటంతో ఈ వివాదం ముగిసిపోయింది.

Next Story
Share it