Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే

వైసీపీ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
X

అధికార వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ద్వారంపూడి ఊగిపోతూ ఆగ్రహంతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఎంత మంది వారించినా ద్వారంపూడి మాత్రం తన దూషణలు ఆపలేదు. కాకినాడ టిడ్కో ఇళ్లలో అవినీతి జరిగిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆరోపించారు. ఒకే పార్టీలో ఉంటూ తనకు చెప్పాలి కదా అంటూ పిల్లి సుభాష్‌‌ చంద్రబోస్‌పై చంద్రశేఖర్ దుర్భాషలాడారు.

మేడ లైన్ ప్రాంతంలో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ మునిగిపోయిందంటూ మరోసారి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్పపై కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, సహచర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.

Next Story
Share it